క్రైమ్/లీగల్

మాజీ జేడీ ఇంట్లో చోరీ కేసులో ఒకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 12: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఇంట్లో చోరికి పాల్పడ్డ నిందితున్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లోని సంస్కృతి ప్లేస్‌లో లక్ష్మినారాయణ కుటుంబం నివసిస్తుండగా వారి వద్ద గుంటూరు జిల్లా కర్లపాలెంకు చెందిన రవికుమార్ డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. రెండేళ్లపాటు నమ్మకంగా విధులు నిర్వహిస్తూ గత ఏడాది నవంబర్‌లో లక్ష్మినారాయణ భార్య ఊర్మిలకు చెందిన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఆలస్యంగా గమనించిన ఊర్మిల ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంతో నమ్మకంగా ఉంటూ చోరీకి పాల్పడటంతో ఎవరికి అతనిపై అనుమానం రాలేదు.
వివిధ కోణాల్లో కేసు విచారించి డ్రైవర్ రవిపై నిఘా వేశారు. పూర్తి ఆధారాలతో అతని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో దొంగిలించిన సొత్తును ఎన్‌బీటీనగర్‌లోని ఓ బ్రోకర్ వద్ద కుదవ పెట్టడంతో పాటు మిగిలిన ఆభరణాలను తన స్వస్థలానికి తరలిస్తున్న క్రమంలో రెడ్‌హ్యాండెడ్‌గా రవిని అదుపులోనికి తీసుకొని విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పూర్తి స్థాయిలో విచారించడంతో చోరి తంతగాన్ని విప్పాడు. అతని వద్ద నుంచి చోరీకి గురైన రూ.20లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ గోవింద రెడ్డి, డీఐ రవి కుమార్ పాల్గొన్నారు.