క్రైమ్/లీగల్

నిషేధిత గుట్కా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 13: గుట్కాలాంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తూ, అక్రమ వ్యాపారాలు చేస్తున్న 10మందిని కడప పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు రెండు టాటా సుమోలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ షేక్ మాసూంబాషా పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. నగరంలోని నాగరాజుపేట రామాలయం గుడి వద్ద వున్న వేణుగోపాల్ జనరల్ స్టోర్స్ నుండి గుట్కా మూటలను వాహనాల్లోకి ఎక్కిస్తుండగా, ముందస్తుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వాటిని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. పోలీసులు తనిఖీ చేసే ప్రయత్నం చేయగా వారు తిరగబడి దాడికి యత్నించారని ఆయన అన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని రెండు టాటాసుమోలను, ఆటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆ మూటల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్టా ఉన్నాయని, వీటి విలువ ఐదున్నర లక్షల రూపాయలు ఉండవచ్చునని డీఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో కడప నగరానికి చెందిన పోలేపల్లి రెడ్డయ్య, అలవల శ్రీనివాసులు, అలంఖాన్‌పల్లెకు చెందిన పేటేటి శ్రీనివాసగుప్త, వీరపునాయునిపల్లె మండలానికి చెందిన ఎద్దుల సురేష్, వేంపల్లెకు చెందిన ఎద్దుల శివప్రసాద్, ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం చంద్రశేఖరరెడ్డి, చెన్నూరుకు చెందిన రెడ్యం వెంకటరమణ, నూకల గోపాలకృష్ణయ్య, అమరావతి సతీష్, ఖాజీపేటకు చెందిన కావడి శేఖర్‌లు ఉన్నారు.
కాగా నగరంలోని నాగరాజుపేటలో పోలేపల్లె రెడ్డయ్య, వేణుగోపాల్ జనరల్ స్టోర్ నిర్వహిస్తూ, వేంపల్లెకు చెందిన శివప్రసాద్, వీరపునాయునిపల్లెకు చెందిన ఎద్దుల సురేష్‌లు బెంగళూరు నుండి అక్రమంగా నిషేధిత గుట్టాలు తీసుకొస్తే వాటిని హోల్‌సేల్‌గా విక్రయించేవారని డీఎస్పీ తెలిపారు. వీరు బెంగళూరు నుండి లారీలలో ద్వారా కడపకు తెచ్చేవారని ఆయన అన్నారు. మిగిలిన నిందితులైన రెడ్యం చంద్రశేఖరరెడ్డి, నూకల గోపాలకృష్ణయ్య, శ్రీనివాసగుప్త, అలవల శ్రీనివాసులులు ఈ గుట్కాలను జిల్లా వ్యాప్తంగా విక్రయించే వారని, గుట్కాకు అలవాటుపడిన ప్రజలకు అక్రమంగా అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారని ఆయన అన్నారు.
సిబ్బందిని అభినందించిన డీఎస్పీ
నిషేధిత గుట్కాను భారీ ఎత్తున స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కడప వన్‌టౌన్ సీఐ పివి సత్యనారాయణ, వన్‌టౌన్ ఎస్‌ఐ ఎస్‌కెఎం హుస్సేన్, సబ్ డివిజన్ క్రైమ్‌పార్టీ సిబ్బంది ఎస్‌ఎండి హుస్సేన్, టి.శేఖర్‌బాబు,ఎస్.నరేంద్రారెడ్డి, ఎస్.ప్రదీప్,బి.సుధాకర్, సాయిగోపీనాధ్‌లను డీఎస్పీ అభినందించారు.