క్రైమ్/లీగల్

గంజాయి స్మగ్లర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, అక్టోబర్ 13: ఇక్కడికి సమీపంలోని వేంపాడు టోల్‌గేట్ వద్ద జాతీయ రహదారిపై శనివారం తమిళనాడుకు చెందిన కొంతమంది దుండగులు మారణాయుదాలతో వచ్చి అదేరాష్ట్రానికి చెందిన గంజాయి స్మగ్లర్‌గా అనుమానిస్తున్న ఒక యువకుడిని సినీ ఫక్కీలో హత్యోదంతం స్థానికంగా సంచలనం రేగింది. ఈ హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణానికి సమీపంలో గల పుదూరు గ్రామానికి చెందిన పి. నీలమేఘ అమరన్ (33) గంజాయి స్మగ్లర్‌గా అనుమానిస్తుండగా ఇతడిని ఇక్కడి టోల్‌గేట్ వద్దగల ఒక హోటల్‌లో ఈరోజు ఉదయం టిఫిన్ చేసి బయటకు వస్తుండగా తమిళనాడు రాష్ట్రంలో జిడింగల్, తూత్తుకుడి, మదురై తదితర ప్రాంతాలకు చెందిన ఏడుగురు కిరాయి హంతకులు కత్తులతో టిఎన్ 57డబ్ల్యూ 5383 నెంబర్ గల ఇన్నోవా కారులో టోల్‌గేట్ దగ్గర మాటువేసి దారుణంగా నరికి పాశవికంగా హత్యచేసారు. నింధితులు ఏడుగురు ఇన్నోవా కారులో వచ్చి టోల్‌గేట్ వద్ద కొద్దిసేపు మాటువేసి ఆనుపానులు చూసుకున్న తరువాత హతుడు అమరన్‌ను హోటల్ నుండి టిఫిన్ చేసిన తరువాత తిరిగి వస్తుండగా ముగ్గురు కారులో ఉండి మరో నలుగురు కిరాయి హంతుకులు బయటకు కత్తులతో వచ్చి మెడపై కత్తితో దారుణంగా నరికి ఆ తరువాత చేతిని తెగనరికి హత్యచేసారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కారును స్టార్ట్ చేసి విశాఖపట్నం వైపు వెళుతుండగా దారితెలియక యలమంచిలి మార్గమధ్యలో పెద్దపల్లి వైపు కారును దారి మళ్లించడంతో నింధితులు ఏడుగురు కూడా అడ్డంగా యలమంచిలి పోలీసులకు దొరికిపోయారు. పెద్దపల్లి నుండి ఇన్నోవా కారును దారిమళ్లించి వెళుతుండగా అక్కడ పోలవరం కాలువ ఉండటంతో వెళ్లే ప్రత్యామ్నాయ రహదారి లేక పొలాల్లోనే ఇన్నోవా కారును హంతకులు విడిచిపెట్టి కత్తులతో పరిగెడుతుండగా అక్కడే క్రికెట్ ఆడుతున్న కొంతమంది యువకులు సహా పెద్దపల్లి గ్రామస్తులు చుట్టుముట్టి నింధితులు ఏడుగురిని పట్టుకుని యలమంచిలి పోలీసులకు అప్పగించడంతో నింధితులు పోలీసుల వలలో చిక్కినట్లయింది. ఈ సంఘటన ఆద్యంతం సినీ ఫక్కీలో జరగగా హతుడు ఇక్కడకు సమీపంలోని అడ్డురోడ్డు వద్ద అతనితోపాటు మరో ముగ్గురిని వెంటబెట్టుకుని గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డురోడ్డును కేంద్రంగా చేసుకుని ఇక్కడే ఒక లాడ్జీలో గత కొంతకాలంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హతుడు అమరన్ తన అనుచర వ్యాపారస్తులతో పాడేరు, అరకు, చింతపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ అడ్డురోడ్డు మీదుగా ఇక్కడి టోల్‌గేట్‌ను దాటించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా హతుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఇదిలావుండగా గంజాయి వ్యాపారంలో రెండువర్గాలు కావడంతో ఒకవర్గం ఇతనిపై కిరాయి గూండాలతో హత్యచేయించే కుట్రలో భాగంగానే ఈ హత్యసంఘటన జరిగినట్లుగా పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హత్య జరిగే సరికి మిగతా ముగ్గురు అదే హోటల్ దగ్గరే ఇతను కూడా ఉన్నప్పటికీ ఈ హత్యోదంతం జరిగిన తరువాత ఆ ముగ్గురు పరారైనట్లు తెలుస్తోంది. ఈ హత్యాకాండలో పాల్గొన్న నింధితుల వివరాల్లోకి వెళితే ఎ.నూతలప్పన్ (26), ఎస్.అజయ్ (37), కె. కన్నన్ (30), ఎస్. పార్ధసారది (26), పి. ప్రశాంత్ (25), ఎల్.షణ్ముగ విఘ్నేష్ (24), ఎస్. లక్ష్మణ్ (23)లు కాగా వీరంతా తమిళనాడుకు చెందిన వారని స్థానిక ఎస్‌ఐ పి. సింహాచలం స్థానిక విలేఖరులకు తెలిపారు. నింధితులు నలుగురు తమిళనాడు రైలులో విశాఖపట్నం చేరుకోగా మిగతా ముగ్గురు నింధితులు ఇన్నోవా కారులో తమిళనాడు నుండి విశాఖ వచ్చిన తరువాత మొత్తం ఏడుగురు నింధితులు ఫోన్ ద్వారా కలుసుకుని విశాఖ నుండి ఇన్నోవా కారులో అడ్డురోడ్డు, నక్కపల్లి ప్రాంతాలకు గత రెండురోజుల క్రితం చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నింధితులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.