క్రైమ్/లీగల్

మహిళపై యాసిడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, అక్టోబర్ 14: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని దామెర గ్రామంలో మహిళపై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన కూరాకుల రజిత అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో జొరబడిన అదే గ్రామానికి బచ్చనబోయిన రమేశ్ ఆమెను పరుష పదజాలంతో తిడుతూ సమీపంలోని వ్యవసాయ భూమి వద్దకు లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో రమేష్ తనవెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రజితపై పోయడంతో ఆమె కాళ్లు, చేతులు, భుజాలు కాలాయి. గతంలో రజితపై రమేష్ అత్యాచారానికి ప్రయత్నించిన సందర్భంలో ఆమె అతడిపై కేసు పెట్టింది. సదరు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమెపై రమేష్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడని, ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.