క్రైమ్/లీగల్

పోలీసులకు చిక్కిన పగటి దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 15: పగటిపూట ఇంటికి తాళం కనబడితే ఇల్లు గుల్లవ్వాల్సిందే. క్షణంలో ఇంట్లో ఉన్న నగదు నగలతో ఉడాయించి జల్సాలు చేసే కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఒంటరిగానే దొంగతనాలు చేయడం ఇతని ప్రత్యేకత. నిందితుడి నుంచి 870గ్రాముల బంగారం, రెండు కేజీల 170 గ్రాములు వెండి ఆభరణలతోపాటు 30వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన పఠాన్ మహబూబ్ ఖాన్ నగరంలోని పాత బస్తీలో నివాసముంటూ దొంతనాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. పగటిపూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పారు. పఠాన్ పై ఏపీ 11, తెలంగాణ 22, కర్ణాటకలో 28 కేసున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ప్యాంటు కడుపు ముందు భాగంలో వీ ఆకారం గల రాడ్, సుత్తి, స్క్రూ డ్రైవరు పెట్టుకుని దొంగతనానికి వెళ్తాడని చెప్పారు. వివిధ కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇంటిని గుర్తించి లోపలికి ప్రవేశించి స్క్రూ డ్రైవర్‌తో అల్మరాను తీసి బంగారం, వెండి, ఆభరణలను దోచుకుపోతాడని తెలిపారు. గత ఆరు సంవత్సరాల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న పఠాన్‌పై కర్ణాటకలో 10 ఎన్‌బీడబ్లూ వారెంట్లుతో పాటు మూడు రాష్ట్రాల్లో 61 కేసులున్నట్లు సీపీ పేర్కొన్నారు. దొంగిలించిన ఆభరణాలను చార్మినార్, బెంగళూర్‌లో విక్రయించుకుని విలాసవంతమైన జీవితం గడుపుతాడని అన్నారు., ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తరచు ఇంటిని మారుస్తుంటాడని సీపీ చెప్పారు. పగటిపూట దొంగతనాలు అధికంగా జరుగుతుండడంతో డీసీపీ క్రైమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ సీసీఎస్ బృందాలను సీపీ రివార్డులిచ్చి అభినందించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిలా, సీఐ చంద్రబాబు, టీ.శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సత్తయ్య, ప్రవీణ్ కుమార్, రాంకుమార్ పాల్గొన్నారు.