క్రైమ్/లీగల్

ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీల్లో పట్టుబడ్డ లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15: తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోలాహలం మొదలయ్యింది. ఇప్పటికే ఎత్తులకు పైఎత్తులతో పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టగా.. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తులు మొదలు పెట్టింది. ఎలక్షన్ కమీషన్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి ముమ్మర తనిఖీలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సోమవారం సాయంత్రం ఎలక్షన్ కమిషన్ స్వ్కాడ్‌లు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కారు (ఏపి09ఇటి1135)లో తరలిస్తున్న దాదాపు రూ.27 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొమ్ము మండల పరిధిలోని ఆదిభట్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ పల్లె గోపాల్‌గౌడ్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే గోపాల్‌గౌడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరుడు కావడం గమనార్హం. గతంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు పల్లెగోపాల్‌గౌడ్ కూడా టీడీపీలో ఉన్నారు. కిషన్‌రెడ్డి గత ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరగా పల్లెగోపాల్‌గౌడ్ ఇటీవలే రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిభట్లలో పేరున్న రియాల్టర్‌గా గోపాల్‌గౌడ్ ఉన్నారు. పట్టుబడిన సొమ్ము తాను రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల నిమిత్తం తీసుకెళ్తున్నట్లు పేర్కొంటున్నప్పటికీ సొమ్ముకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. గోపాల్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ వార్త నియోజకవర్గ వ్యాప్తంగా దావానంలా వ్యాపించడంతో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.