క్రైమ్/లీగల్

హుండీల చోరుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, ఫిబ్రవరి 6: సామర్లకోట పంచారామాక్షేత్రం భీమేశ్వరాలయంలో హుండీల చోరికి పాల్పడిన కేసులో నిందితుని అరెస్టు చేసి అతని వద్ద నుండి రూ.10,000లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సామర్లకోట పోలీసు స్టేషన్ పై భాగంలోవున్న సిసిఎస్ స్టేషన్ భవనంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నిందితుడిని చూపారు. 2017 డిసెంబర్ 22వ తేదీన, అంతకు ముందు భీమేశ్వరాలయంలో చాకచక్యంగా ప్రవేశించి హుండీల తాళాలను పగుల గొట్టి భక్తులు వేసిన ఆదాయంను దోచుకున్న విషయం పాఠకులకు విదితమే. అయితే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ సిహెచ్‌వి రామారావు, సిఐ ఎస్ ప్రసన్న వీరయ్యగౌడ్‌ల ఆధ్వర్యంలో ఆలయం వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసు నిఘా వున్నప్పటికీ ఆగంతకుడు రెండోసారి చోరీకి పాల్పడ్డాడు. సీసీ టీవి పుటేజీల ఆధారంగా నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన బోసారపు వెంకట దుర్గ అనే పండు (20) ఈ చోరీలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టుచేశారు. పలు తాళాలు వేసి వున్న ఇళ్ళ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, పోలీసులు వలపన్ని పట్టుకుని ఆరా తీయగా హుండీల చోరీ ఉదంతం అంగీకరించినట్లు డిఎస్పీ చెప్పారు. హుండీల్లో సుమారు రూ.15 వేలు రాగా రూ.5 వేలు ఖర్చు చేయగా, రూ.10 వేలును స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు మరణించడంతో నిందితుడు వెంకట దుర్గ సవతి తల్లిపై ఆధారపడి అల్లర చిల్లరగా తిరుగుతూ ఈ నేరానికి పాల్పడినట్టు చెప్పారు. ఈ కేసులో సిసిఎస్ సిఐ ఎస్‌జీ వల్లీ, సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసునాయక్, సిసిఎస్ ఎస్సై కెవి సూర్యనారాయణ, హెచ్‌సిలు జి బలరామ్మూర్తి, కె రంగబాబు, జిఎస్‌ఎన్ మూర్తి, పిసీలు బి రాధాకృష్ణ, జె నాగరాజు, ఎం రాకేష్‌లు సహకరించినట్లు డిఎస్పీ రామారావు వివరించారు. ఈ సమావేశంలో పెద్దాపురం సిఐలు ఎస్ ప్రసన్న వీరయ్యగౌడ్, వల్లీ, ఎస్సైలు ఎల్ శ్రీను, ఎస్ లక్ష్మీకాంతం, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.