క్రైమ్/లీగల్

ఐటీ అధికారుల వేధింపులు ..వ్యాపారి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(పెనమలూరు), అక్టోబర్ 16: ఐటీ అధికారుల వేధింపులకు లారీ బాడీ బిల్డింగ్ యూనిట్ యజమాని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడలోని సనత్‌నగర్‌కు చెందిన సాదిక్(46) 26ఏళ్లుగా జవహర్ ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్ యూనిట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొనే్నళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో ఐటీ అధికారులు అతని యూనిట్‌కు వచ్చి రూ. 50లక్షలు జరిమానా విధించారు. రూ. 15లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని ఓ అధికారి ఆయనకు చెప్పాడు. ఈనేపథ్యంలో ఐటీ అధికారులు ఫోన్లు చేస్తూ ఒత్తిడికి గురిచేయడంతో సాదిక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బందరు కాల్వలో దూకిన సాదిక్ మృతదేహం నాగాయలంక - అవనిగడ్డ లాకుల వద్ద 34గంటల తరువాత తేలింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో సాదిక్ కంకిపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఆటోనగర్ ఏపీఏ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అందరితో స్నేహంగా మెలిగేవాడంటూ పార్టీలకు అతీతంగా వేలాది మంది ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్, అనే్న చిట్టిబాబు, ఎంపీపీ బొర్రా కనకదుర్గ, వైస్ ఎంపీపీ కోయా ఆనంద్, యూత్ నాయకుడు నవీన్ నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆటోనగర్‌కు మంగళవారం సెలవు ప్రకటించారు. ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఫిజా, సభ్యుడు అబ్దుల్ గౌస్, తదితరులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.