క్రైమ్/లీగల్

సీబీఐ డీఎస్పీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారే ముడుపులు తీసుకున్నారన్న వార్తలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ముడుపుల వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీబీఐ చీఫ్ అలోక్‌వర్మ, స్పెషన్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ దేవేందర్ కుమార్‌ను సోమవారం సీబీఐ అరెస్టు చేసింది. మాంసం వ్యాపారి, హవాలా నిందితుడు మొయిన్ ఖురేషీ కేసులో
దేవేందర్ కుమార్ విచారణ అధికారిగా పనిచేశారు. ఖురేషీపై కేసు మాఫీకే ఆస్థాన 2 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు సీబీఐ ఇంతకు ముందే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అలోక్ వర్మకు కూడా ముడుపులు ముట్టాయని ఆస్థాన ఏకంగా కేంద్రానికి లేఖలు రాశారు. చివరికి ఆస్థానాపైనే కేసు నమోదైంది. కాగా కేసు నుంచి బయటపడేందుకు కుమార్‌కు లంచం ఇచ్చినట్టు సతీష్‌సానా లిఖిత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడు. విచారణ అధికారిగా ఉండి సాక్ష్యాలు తారుమారు చేశారని అతడు ఆరోపించాడు. వీటన్నింటినీ ఆస్థానా నేతృత్వంలోని దర్యాప్తు బృందం గత నెల 26న సానాను విచారించి, వాంగ్మూలం రికార్డు చేసింది. ఖురేషీ హైదరాబాద్ వ్యక్తి కావడంతో అక్కడి నాయకులకు ఇందులో ప్రమేయం ఉందని తేలింది. ఈ విషయాన్ని సతీష్ సానా విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. గత జూన్‌లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో మాట్లాడినట్టు సానా వెల్లడించాడు. రమేష్ సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడిన తరువాత తనకు ఏమీ కాదని భరోసా ఇచ్చినట్టు అతడు తెలిపాడు. ‘జూన్ నుంచి ఇప్పటి వరకూ నాకు సీబీఐ నుంచి ఒక్కసారి కూడా పిలుపురాలేదు. కేసు నుంచి బయటపడిపోతానన్న నమ్మకం ఏర్పడింది’ అని సతీష్ సానా పేర్కొన్నాడు. సానా చెప్పినవన్నీ దర్యాప్తు అధికారులు లిఖితపూర్వకంగా నమోదు చేసుకున్నారు.