క్రైమ్/లీగల్

చోరీలకు పాల్పడే ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 22: ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3.24లక్షల విలువైన 122గ్రాముల బంగారు నగలు, చేతి గడియారం స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బీ రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గిరిపురానికి చెందిన నత్తా సుధాకుమార్ (38) పెయింట్ పనులు చేసేవాడు. నేరాలకు అలవాటు పడిన క్రమంలో మాచవరం పోలీస్టేషన్ పరిధిలోని గిరిపురంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు చోరీ చేశాడు. ఈ కేసులో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి ఒక బంగారు బ్రాస్‌లెట్, 4 చెవిదిద్దులు, 4 ఉంగరాలు, ఒక బాల్స్ చైన్, బంగారు గాజు, టైటాన్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నున్న గ్రామానికి చెందిన తోట యువశివనాగరాజు (20) ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తూ నేరాలకు అలవాటు పడి గిరిపురం నెహ్రూ నగర్‌లో తలుపులు దగ్గరగా వేసి ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారు నగలు దొంగిలించాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు బంగారు బుట్టలు, బంగారు గొలుసు, లాకెట్, చెవిదిద్దులు, ఉంగరం, మాటీలువ, మరో ఉంగరం, చెవి రింగులు స్వాధీనం చేసుకున్నారు.