క్రైమ్/లీగల్

18 ఏళ్లా..కుదరదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: వివాహం చేసుకునేందుకు పురుషుడి వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని, దీనికి సంబంధించి చట్టంలో మార్పులు తీసుకురావాలని దాఖలైన ఓ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన చీఫ్ జస్టిర్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు 25వేల జరిమానా విధించింది. అసలు ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని పిటిషనర్/న్యాయవాది అశోక్‌పాండేను నిలదీసింది. యుక్తవయసుకు సంబంధించి వివిధ సెక్షన్లను క్రోడీకరిస్తూ పాండే ఈ పిటిషన్ దాఖలు చేశాడు. 18 ఏళ్లు నిండగానే మగవాడు ఓటరుగా నమోదు అవుతాడని, అయితే పెళ్లికి మాత్రం అర్హుడు కాదని చెప్పడం భావ్యం కాదని పిటిషనర్ వాదించారు. లాయర్ వాదనతో ఏకీభవించని ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే 25,000 రూపాయల జరిమాన విధిస్తూ ఆదేశించింది. జరిమానా రద్దుచేయాలని పిటిషనర్ చేసుకున్న అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.‘18 ఏళ్ల వ్యక్తి ఈ తరహా పిటిషన్‌తో మమ్మల్ని ఆశ్రయిస్తే..నీవుడిపాజిట్ చేసిన సొమ్ములు అతడికి అందజేస్తాం’అని న్యాయమూర్తులు ప్రకటించారు. ‘నీ పిటిషన్‌లో ప్రజాప్రయోజనం లేదు. మీకు ఆ అర్హతాలేదు’అని కోర్టు మందలించింది. హిందూ వివాహ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టంలోని పలు సెక్షన్లను పిటిషనర్ ప్రస్తావించారు. 18 ఏళ్లకే పురుషుడు, స్ర్తికి ఓటు హక్కు వస్తోందని, ఎన్నికల్లో ఓటు వేస్తున్నారని అశోక్‌పాండే తెలిపారు. అలాంటప్పుడు పెళ్లి చేసుకునే వయస్సులో తేడాలెందుకని ఆయన ప్రశ్నించారు.