క్రైమ్/లీగల్

దగ్గుబాటి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు రాంగ్ రూట్‌లో వెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై దంపతులు, వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్‌లోని కార్కానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
కార్కానా సీఐ మధుకర్ స్వామి కథనం ప్రకారం బాలంరాయి సమీపంలోని ఇంపీరియల్ గార్డెన్ ఎదురుగా పోలో గ్రౌండ్ ఎదుట సురేష్‌బాబు కారు (టీఎస్ 9 ఇఎక్స్ 2628) రాంగ్‌రూట్లో వెళ్తోంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురూ గాయపడ్డారు. రోడ్‌పై పడిపోయిన వారిని 108 వాహనంలో యశోద ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బాధితుల బంధువుసంజయ్‌కుమార్ ఆసుపత్రికి చేరుకుని కార్కానా పోలీసులకు. నిర్మాత కారు ఢీకొని సతీష్ చందర్ (35),దుర్గాదేవి (30),సిద్దేశ్ చంద్ర (3) గాయపడ్డారు.
తుకారాంగేటుకు చెందిన వీరు కూకట్‌పల్లిలోని విందుకు హాజరై హోండా యాక్టివాపై వస్తుంగా ప్రమాదం జరిగింది. యాక్టివా కూడా ధ్వంసమైంది. కారులో ఉన్నది దగ్గుపాటి సురేష్‌గా గుర్తించిన పోలీసులు ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. దగ్గుబాటిపై ఐపీసీ 337 ప్రకారం కేసు నమోదు చేశారు. సెక్షన్ 41ఏ కింద నోటీసు జారీ చేశారు.