క్రైమ్/లీగల్

పాడేరు ఘాట్‌లో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉండగా మరో బాలుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. పాడేరు మాజీ ఎంపీపీ ఎస్‌వీవీ రమణమూర్తి కుటుంబ సభ్యులు పెందుర్తిలో నివాసం ఉంటూ విజయదశమి సందర్భంగా ఇటీవల పాడేరు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం పాడేరు నుంచి వీరు తిరిగి వెళ్తున్న ఆటో ఘాట్‌లోని వంట్లమామిడి-కోమాలమ్మ మలుపు మధ్య ప్రమాదానికి గురైంది. ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న రమణమూర్తి కూతురు సాయిలత (చిట్టి) (25), కోడలు మరియమ్మ (23), మరియమ్మ కూతురు, ఆరు నెలల పసిపాప అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రమణమూర్తి కుమారుడు అంబేద్కర్, ఆటో డ్రైవర్ గణపతి తీవ్రంగా గాయపడ్డారు. అంబేద్కర్ తలకు బలమైన గాయం తగలడంతో తల భాగం రెండు ముక్కులుగా చీలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన అంబేద్కర్‌కు పాడేరు ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాడేరు మండలం కిండంగి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జవ్వాది గణపతిని చోడవరం ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రమణమూర్తి మనవడు (2) సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఈ బాలుడి తల్లి మరియమ్మ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, తండ్రి అంబేద్కర్ మృత్యువుతో పోరాటం చేస్తుండడం పలువురిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనతో రమణమూర్తి కుటుంభంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
చిత్రం..ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆటో