క్రైమ్/లీగల్

పోలీస్ తనిఖీ: రూ.18 లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 22: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నియమావళిని ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు పోలీసులు చేపట్టిన విస్తృత తనిఖీల్లో కరీంనగర్ బస్టాండ్‌లో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీ చేస్తుండగా రూ.18,24,700 పట్టుబడ్డాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి..కాటారంకు చెందిన ఎం.డి.బోలేష్ వద్ద రూ.6 లక్షలు, చెన్నైకు చెందిన మహేష్ అజ్మీరా వద్ద రూ.1,93,000, కోరుట్ల పట్టణానికి చెందిన సునీల్ కుమార్ వద్ద రూ.5,31,700, రాజస్థాన్‌కు చెందిన భూపాల్ శర్మ వద్ద రూ.5 లక్షలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తుండగా వారి నుంచి రూ.18,24,700 పట్టుకున్నట్లు పోలీసులు వెళ్లడించారు. వారి నుండి డబ్బులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీసులు వెల్లడించారు. ఈ డబ్బులకు సంబందించిన ఆధారాలను విచారణలో చూపించినట్లయితే వాటిని కూడా పొందపరుస్తూ కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే నగర పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా రెండు ఎక్సెస్ కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఇదేవిధంగా 20 కేసుల్లో 205 మందిని బైండోవర్ చేసినట్లు నగర పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు మరో 12 మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని, ఎన్నికల నియమావళి అతిక్రమించి నిబందనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్దమొత్తంలో డబ్బులను తరలిస్తే స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని నగర పోలీసులు వెల్లడించారు.