క్రైమ్/లీగల్

వచ్చేనెల 13న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించాలని గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను నవంబర్ 13వ తేదీన విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన అప్పటి ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు మహిళలు ఆలయ ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చారు. కాగా ఒక మహిళా న్యాయమూర్తి ఈ తీర్పుతో విబేధించారు. కాగా శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తూ వెలువడిన తీర్పును సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం స్వీకరించింది. జాతీయ అయ్యప్ప భక్తుల సంఘంతో పాటు మొత్తం 19 మంది రివ్యూ పిటిషన్లను దాఖలు చేశాయి. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలను కోర్టు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అయ్యప్ప భక్తుల సంఘం త్రినిధి మ్యాథ్యూస్ జే నెడుంపర ప్రస్తావించారు. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. కేరళతో పాటు దేశ వ్యాప్తంగా భక్తులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. దసరా సెలవుల తర్వాత మాత్రమే రివ్యూ పిటిషన్‌ను స్వీకరిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పైగా ఈ పిటిషన్లను చాంబర్లలో విచారిస్తామని, బహిరంగ కోర్టులో విచారించబోమని పేర్కొంది. అయ్యప్ప భక్తుల సంఘం తరఫున అధ్యక్షుడు శైలజ విజయన్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.