క్రైమ్/లీగల్

30 లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలగిరి, అక్టోబర్ 23: అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మండల కేంద్రంలోని జనగాం రోడ్డులో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.30లక్షల నగదును పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి నాగారం సీఐ జె.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లాకేంద్రం నుండి హోండాకారు (నెంబర్ ఎంహెచ్ 43ఎక్స్ 4226)లో తిరుమలగిరి మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా సవుళ్ల రామారం గ్రామంలోని శ్రీసాయి జిన్నింగ్‌మిల్లుకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు తెలిపారు. తహశీల్దార్ సిహెచ్.విజయ్ సమక్షంలో విచారణ జరిపించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదికను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని, నగదుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపిన తర్వాత నిబంధనల ప్రకారం అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ డేవిడ్‌కుమార్, ఆర్‌ఐ ప్రసన్న, వీఆర్వో శోభ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..పట్టుబడిన నగదును చూపుతున్న పోలీసు అధికారులు