క్రైమ్/లీగల్

రూ 1.10కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మార్చి 3: బెంగళూరు నుండి కాకినాడ వెళుతున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న ముఠాగుట్టును గుంటూరు జిల్లా తెనాలి రైల్వేపోలీసులు రట్టుచేశారు. రైల్వే ఎస్పీ కెవి మోహనరావు కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన ఆశీర్వాద్ బంగారు దుకాణంలో పనిచేస్తున్న గుమస్తాలు ప్రగళ్ళపాటి ప్రభాకరరావు, దుడె అంజిబాబులు బెంగళూరు నుండి కాకినాడకు వస్తున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో మూడున్నర కిలోల బంగారం చెన్నైలో కొనుగోలుచేసి రాజమండ్రికి తరలించేందుకు ఎక్కారు. మార్గమధ్యంలో శనివారం తెల్లవారుజామున రైలు తెనాలి వచ్చేలోగా గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఫోన్‌కాల్ సమాచారంతో నిందితులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారిలో ప్రభాకరరావు వద్దనుండి కేజీ, అంజిబాబు వద్దనుండి రెండున్నర కేజీల బంగారం గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపక పోవటంతో చెన్నై నుండి అక్రమంగా బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

చిత్రం..నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన రైల్వే ఎస్పీ మోహన్‌రావు (ఇన్‌సెట్‌లో) బంగారం బస్కెట్లు