క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో పత్తి దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 3: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాటన్ మిల్లులో పత్తి దగ్ధమైన సంఘటన షాద్‌నగర్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని సోలీపూర్ గ్రామ శివారులో గౌరవ్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పత్తి పూర్తిగా దగ్ధమైపోయింది. కాటన్ మిల్లులో మొత్తం 280టన్నుల పత్తి ఉండగా షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. తెల్లవారు ఝామున ఉదయం ఐదుగంటల సమయంలో గౌరవ్ ఇండస్ట్రిస్ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా దట్టమైన పోగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో ఉన్న సిబ్బంది షాద్‌నగర్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. అప్పటికే పరిశ్రమలో ఉన్న 280టన్నుల పత్తి దగ్ధమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, సీఐ అశోక్‌కుమార్ తమ సిబ్బందితో కాటన్ మిల్లు వద్దకు చేరుకొని సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాటన్ బిల్లు యజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు షాద్‌నగర్ టౌన్ సీఐ అశోక్‌కుమార్ వివరించారు.
ఆర్టీసీ డిపోలో స్క్రాప్ దగ్ధం
జీడిమెట్ల, మార్చి 3: జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో స్క్రాప్‌కు మంటలు చెలరేగి తుక్కు పూర్తిగా దగ్ధమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో తుక్కును ఒకేదగ్గర నిర్లక్ష్యంగా వదిలేశారు. సిగరేట్ తాగి ఆర్పకుండా తుక్కులో విసిరారా లేదంటే ఎవరైనా మంటలు అంటించారో తెలియదు. పాడైన తుక్కులో మంటలు ఉవ్వెత్తున చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడే తుక్కును వదిలేయడంతో ప్రమాదం జరిగిందని పలువురు చెబుతున్నారు. డిపోలో ఎప్పటికప్పుడు స్క్రాప్‌ను తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.