క్రైమ్/లీగల్

రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి, ఫిబ్రవరి 6: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది, ఉదయగిరి ఎస్‌ఐ నక్కా ప్రభాకర్, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా సోమవారం మండలంలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 88 ఎర్రచందనం దుంగలు, 5 లక్షల విలువైన ఒక స్విప్ట్ వాహనం, 80వేలు విలువైన రెండు మోటారుబైక్‌లు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ టిపి విఠలేశ్వర్ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో దొరికే విలువైన ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు విదేశాలకు తరలిస్తున్నారని, వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎస్పీ ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటుచేసి ఉక్కుపాదం మోపారన్నారు. పట్టుబడిన నలుగురికి అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. పట్టుబడిన స్మగ్లర్లలో ఎం.మాణిక్యం, ఫరానుల్లా ఇద్దరు తమిళులు, బషీరుద్దీన్ కోల్‌కతా, వెనిగండ్ల ఆదినారాయణ సైదాపురానికి చెందినవారిగా గుర్తించామన్నారు. వీరిలో మాణిక్యం తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడని, ఇతను ఆంధ్రాలోని ఎర్రచందనం దుంగలను చైనా, సింగపూర్, మలేషియాకు తరలిస్తుంటాడన్నారు. 88 దుంగల బరువు 2010 కేజీలు కాగా బహిరంగ మార్కెట్‌లో వీటి ధర రెండు కోట్లకు పైమాటేనన్నారు. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం తరలిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.