క్రైమ్/లీగల్

నీరవ్, చోక్సీలపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 3: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 12.7వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహెల్ చోక్సీలపై ప్రత్యేక కోర్టు నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎస్ అజ్మి మార్చి 1న ఇద్దరిపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు జారీ చేశారు. కేసు విచారణలో భాగంగా తమముందు హాజరుకావాలని ఇంతకుముందే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మోదీ, చోక్సీలకు సమన్లు జారీ చేయడం తెలిసిందే. అయితే, క్రిమినల్ కేసులు నమోదు కాకముందే దేశం విడిచి పారిపోయిన ఇద్దరు వజ్రాల వ్యాపారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకాలేకపోయారు. దీంతో ఫిబ్రవరి 27న ఈడీ పిటీషన్ మేరకు పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఇద్దరిపై ఎన్‌బిడబ్ల్యు జారీకి ఆదేశించింది. ప్రత్యేక కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది హితెన్ వెనెగాంకర్ వాదనలు వినిపిస్తూ ‘వజ్రాల వ్యాపారి చోక్సీకి ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేశాం. సమన్లకు ఆయన స్పందించలేదు. కనీసం హాజరు కాలేదు కూడా’ అని వివరించారు.