క్రైమ్/లీగల్

తండాలో ఆడ శిశువు అదృశ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మార్చి 3: దేవరకొండ మండలం ముదిగొండ గ్రామపంచాయతీ పరిధి లోని రత్యాతండాకు చెందిన జఠావత్ సరోజ, శ్రీను దంపతులకు మూడో కాన్పులో జన్మించిన ఆడశిశువు కనిపించకుండా పోయిందని ఈ విషయమై విచారణ జరపాలని కోరుతూ దేవరకొండ సీడీపీవో సక్కుబాయి శనివారం దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి సీ ఐ ఎంజీ ఎస్ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రత్యాతండాకు చెందిన జఠావత్ సరోజ, శ్రీను దంపతులకు 2017 ఆగస్టు 25 వ తేదీన మూడో కాన్పులో ఆడపిల్ల జన్మించిందన్నారు. సెప్టెంబర్ 7, 2017 న బ్రతుకు దెరువు నిమిత్తం హైద్రాబాద్‌కు వలస వెళ్ళిన సరోజ దంపతులు తిరిగి 2018 ఫిబ్రవరి 15 న స్వగ్రామానికి వచ్చారని అయితే వీరి వెంట వారి శిశువు లేకపోవడంతో అంగన్‌వాడి టీచర్ వారిని విచారించగా తమ బిడ్డ తమ ఇష్టం అని అడిగేందుకు మీరెవరంటూ అంగన్‌వాడి టీచర్‌పై దురుసుగా వ్యవహరించారని చెప్పారు. సీడీపీవో సక్కుబాయి కూడా వారిని విచారించేందుకు యత్నించగా వారితో కూడా బిడ్డ విషయం చెప్పకుండా సరోజ దంపతులు దురుసుగా వ్యవహరించడంతో సీడీపీవో సక్కుబాయి శనివారం తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. సీడీపీవో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీ ఐ ఎంజీ ఎస్ రామకృష్ణ చెప్పారు.