క్రైమ్/లీగల్

ముత్తూట్ ఫైనాన్స్‌లో మేనేజర్ చేతివాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, మార్చి 3: సులభంగా రుణాలు వస్తాయని, తాకట్టు పెట్టిన బంగారు నగలు భద్రంగా ఉంటుందని భావించిన ఖాతాదారులకు ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రకాష్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులకు చెందిన రూ.కోటి విలువ కలిగిన ఆభరణాలను మాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు రూ. 40లక్షల విలువచేసే ఖాతాదారుల ఆభరణాలు లాకర్లోనుంచి మాయమైనట్లు ఆడిటర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రుణాలు తీసుకున్న కొంతమంది పేర్లు మార్చి రుణాలు ఇచ్చినట్లు చూపించాడు. ఇక లాకర్లో ఉంచిన ఖాతాదారుల బంగారు ఆభరణాలకు సంబంధించిన సంచిలో గిల్ట్ నగలను ఉంచాడు. గిల్ట్‌నగలను కొనడానికి డబ్బు వృథా అనుకున్నాడేమో కాని కొందరు ఖాతాదారులకు సంబంధించిన బంగారు ఆభరణాల స్థానంలో రాళ్లు ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. లాకర్లో ఉన్న ఆభరణాలు బయటికి తీయాలంటే అది ఒక్క మేనేజర్‌కు మాత్రమే సాధ్యం కాదని, బ్యాంకులో ఉన్న మరికొంత మంది సిబ్బంది సహకారం కూడా ఉండివచ్చన్న అనుమానాలను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మేనేజర్ ప్రకాష్ క్రికెట్ బెట్టింగ్ కోసం ఖాతాదారుల బంగారు ఆభరణాలను కర్ణాటక రాష్ట్రంలో విక్రయిచినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటి వరకు రూ.40లక్షలు మేర ఆభరణాలు మాయం అయ్యాయని తేలింది. గత నాలుగు రోజులుగా 14 మంది ఆడిటర్ల తనిఖీల్లో ప్రాథమికంగా తేలినప్పటికి ఇది కోటి పైమాటేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రుణాలు చెల్లించి తాము తనఖా పెట్టిన ఆభరణాలను తీసుకునేందుకు వెళ్లిన ఖాతాదారులకు మేనేజర్ పొంతనలేని సమాధానం చెబుతూ వచ్చాడు. ముఖ్యంగా ఆన్‌లైన్ పనిచేయడం లేదని, ఇప్పుడు రుణాలు తీసుకుని నగలు ఇవ్వలేవని చెపుతున్నారని ఖాతాదారులు చెబుతున్నారు. మేనేజర్ ప్రవర్తనపై కొంతమంది ఖాతాదారులు అనుమానించడంతో ఈవ్యవహారం వెలుగుచూసింది. కొంత మంది ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో వారికి సర్ధిచెప్పినట్లు సమాచారం. ఖాతాదారుల నగలు గల్లంతు వార్త ఖాతాదారులకు తెలియడంతో వారంతా ఒక్కొక్కరూ సంస్థ కార్యాలయానికి చేరుకుని మేనేజర్‌ను నిలదీస్తున్నారు. అప్పటికే ఆసంస్థ యాజమాన్యం ప్రకాష్ అక్రమాలను గుర్తించి ఆడిటర్లను పెట్టి తనిఖీ చేయడంతో అతని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. శనివారం ఆడిటర్లు పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. కాగా ప్రకాష్ స్థానంలో సోమవారం మరో మేనేజర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. సంస్థ సిబ్బంది మాత్రం బాధితులకు న్యాయం చేస్తామని చెబుతున్నారు. కాగా మేనేజర్ ప్రకాష్ చేతివాటంతో ఎంతమంది ఖాతాదారుల ఆభరణాలు మాయమైయ్యాయో సోమవారం తేలనుంది.