క్రైమ్/లీగల్

టీడీపీ కార్యకర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, ఫిబ్రవరి 6: మండలంలోని గోపాలపెంట గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగళవారం మధ్యాహ్నం 12 సమయంలో టీడీపీ కార్యకర్త చిట్టి పాపారావు(36) సమీప జీడితోటల్లో పురుగుల మందు తాగి తన మృతికి కారణాలు తెలుపుతూ లేఖను కూడా రాసుకున్నాడు. లేఖ కథనం ప్రకారం 2015-17 సంవత్సరాల్లో స్థానికంగా ఇసుక ర్యాంపు నడిచేదని దీనికి సంబంధించి కొన్ని పనులకు గాను వేతనదారులకు డబ్బులు ఇవ్వడం జరిగిందని అయితే తానే ఈ పనులు చేయించినట్లుగా రశీదులను సృష్టించి వెలుగు కార్యాలయం నుండి తన పేరుపై చెక్కులను తీసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఖర్చుల నిమిత్తం వచ్చిన డబ్బుల్లో మిగిలిన వాటిని అదనంగా డిపోజిట్‌రూపంలో వెలుగు అధికారులకు అందజేశానని అయినప్పటికీ స్థానికులు తనపై లేనిపోని ఆరోపణలు చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖలో తెలిపారు. అ లేఖలో వెలుగు అధికారుల పేర్లు, స్థానిక ప్రజల పేర్లు రాసి ఉంచడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతునకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. కాగా మంగళవారం సాయంత్రం టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు గుంపులగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడం గమనార్హం