క్రైమ్/లీగల్

కార్తీ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను రద్దుచేయాలని కోరుతూ మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారం చేసుకొని, ఈడీకి నోటీసులు జారీ చేసే అధికారం లేదని కార్తీ చిదంబరం తన తాజా పిటిషన్‌లో వాదించారు. కార్తీ చిదంబరం న్యాయవాది ఈ మేరకు సోమవారం చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆలకించి, వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న సంబంధిత అంశాలపై వాదనలు వినడానికి అంగీకరించింది.
కార్తీకి వ్యతిరేకంగా ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే ఇవ్వడానికి, ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘ఈయన సామాన్య నేరస్థుడు కాదు’ అంటూ సిబిఐ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి అంగీకరించలేదు. కాకపోతే హాజరు కావలసిన తేదీని వాయిదా వేయాల్సిందిగా సంబంధిత ఈడీ అధికార్లకు విజ్ఞప్తి చేయవచ్చునని కార్తీకి కోర్టు సూచించింది. ప్రస్తుతం కార్తీ చిదంబరం ఐఎన్‌ఎక్స్ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్నారు. కాగా కార్తీ కేసును సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తున్నారు. ఈడీ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేసేందుకు వీలుగా పిటిషన్‌ను దాఖలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని సిబాల్, కోర్టును అభ్యర్థించారు. 2017 మే నెలలో ఈడీ, కార్తీక్ తదితరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్పర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను నమోదు చేసింది. ఇది పోలీసులు నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌కు సమానం. ఈసీఐఆర్‌లో కార్తీ చిదంబరంతో పాటు, ఐఎన్‌ఎఎక్స్ మీడియా, దాని డైరెక్టర్లు, పీటర్, ఇంద్రాణి ముఖర్జీల పేర్లున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియా విదేశాలనుంచి రూ.305 కోట్లు స్వీకరించేందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) అనుమతించిందంటూ, గత ఏడాది మే 15న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అప్పట్లో చిదంబరం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కార్తీచిదంబరంపై సీబీఐ జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన స్టేఆర్డర్‌ను సవాలు చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు మంగళవారం విచారిస్తుంది. గతంలో సిబిఐ దాఖలు చేసిన లుక్ ఔట్ నోటీసుపై, మద్రాసు హైకోర్టులోని సింగిల్ జడ్జి స్టే విధించారు. తర్వాత సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే జారీచేసింది.