క్రైమ్/లీగల్

యజమాని రాక్షసత్వానికి కార్మికుడి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 5: యజమాని రాక్షసత్వానికి కార్మికుడు బలైన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పరిధిలోని పారిశ్రామికవాడలో పెట్రోజంప్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలో పని చేసే నిపుణ్‌సాహు(24) ఒరిస్సా నుంచి బతుకుదెరువు కోసం వచ్చి జీవనం సాగిస్తున్నాడు. నిపుణ్‌సాహు పని చేసుకుంటూ అదే కంపెనీలో ఉంటున్నాడు. నిపుణ్‌సాహును నిర్బంధించి యజమాని పని చేయించుకునేవాడు. కనీసం ఆహారం అందించక, నిద్ర లేకపోవడంతో నిపుణ్‌సాహు ఆరోగ్యం క్షీణించింది. కంపెనీలో వ్యర్థాల వాసనకు శనివారం ఉదయం స్పృహతప్పి పడిపోయాడు. దీంతో నిపుణ్‌సాహును యజమాని ఉస్మానియా ఆసుపత్రికి గుట్టుచప్పుడు కాకుండా తరలించాడు. ఆసుపత్రికి తరలించేలోపే నిపుణ్‌సాహు తుదిశ్వాస విడిచాడని డాక్టర్లు తెలిపారు. దీంతో మృతుని కుటుంబీకులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కార్పొరేటర్ మద్దతు
నిపుణ్‌సాహు మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిరసిస్తూ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌పార్టీ సీనియర్ నాయకుడు శ్రీశైలంరెడ్డి అక్కడకు చేరుకుని నిపుణ్‌సాహు కుటుంబీకులు, కంపెనీ యాజమాన్యంతో చర్చించి నష్టపరిహారంగా రూ. నాలుగు లక్షలు, దహన సంస్కారాలకు రూ.30 వేలను ఇప్పించేలా ఒప్పించారు. దీంతో కుటుంబీకులు ఆందోళన విరమించారు.