క్రైమ్/లీగల్

కుటుంబం సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు: గ్యాస్ గీజర్ పేలిన ప్రమాదంలో ఓ కుటుంబమంతా సజీవ దహనమైన దుర్ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మడిబాక పంచాయతీ పరిధిలోని రాజులకండ్రిగ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తిరుపతి అర్బన్ ఏఎస్పీ పి.అనిల్‌బాబు కథనం ప్రకారం- మడిబాక పంచాయతీ పరిధిలోని రాజులకండ్రిగ గ్రామంలో గత మూడు నెలల నుంచి శ్రీనివాసులురెడ్డి (38), అతని భార్య బుజ్జమ్మ (33), వారి కుమార్తె భవ్య (7), కుమారుడు నితిన్ (4)తో ఇటీవల నూతనంగా నిర్మించుకున్న భవనంలో నివాసం ఉంటున్నారు. బెడ్‌రూమ్ పక్కనే ఉన్న బాత్‌రూమ్‌కి గ్యాస్‌తో కూడిన గీజర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్యాస్ పైపు లీకేజీతో పాటు విద్యుత్ బల్బు తోడుకావడంతో కుటుంబం గాఢనిద్రలో ఉండగా మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు పోలీసులు విచారణ చేస్తున్నారని ఆయన తెలిపారు.
అనుమానాలెన్నో..
పైభాగంలో ఇతరులు నూతనంగా నిర్మించుకున్న ఇంటిలో గృహప్రవేశం చేస్తూ మేల్కొని ఉన్నారు. ఇంటి తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు ఎక్కడా పేలిన దాఖలాలు లేవు. ఏదైనా గొడవల కారణంగా ఆవేశంలో మంటలు పెట్టుకున్నా మృతిచెందే సమయంలో కేకలు పెట్టేవారు. అలాంటివేమీ లేవు. ఎవరైనా గిట్టనివారు చేసిన పనా? లేక మరేయితర కారణాలేమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమీద ఈ సంఘటన ఎలా జరిగిందనేది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.