క్రైమ్/లీగల్

షార్ట్‌సర్క్యూట్: యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాలఘణపురం, నవంబర్ 11: ఫోన్ చార్జింగ్ పెట్టి పాటలు వింటున్న క్రమంలో షార్ట్‌సర్క్యూటై ఒకరు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం చిరిపురం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బస్వగాని అనిల్ (30) బతుకు దెరువు కోసం ఉప్పల్ సమీపంలోని అనోజిగూడలో జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పాటలు వింటున్న క్రమంలో షార్ట్‌సర్క్యూట్ అయి అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంత్యక్రియల నిమిత్తంగా చిరిపురం గ్రామానికి తీసుకువస్తున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

చిత్రం..అనిల్ మృతదేహం