క్రైమ్/లీగల్

గుట్కా దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 12: నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం కొరడా జుళిపించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పీవీ రాధాకృష్ణ ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణాచారి, డీసీటీఓ చిన్నారెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి శేషారెడ్డి, ఎస్‌ఐ రామస్వామిలు పాన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక లీలామహల్ జంక్షన్ వద్ద ఉన్న పీ.షబ్బీర్‌కు చెందిన దుకాణంలో విక్రయిస్తున్న రూ.20 వేలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి చేశారు. 371/ 378 అండర్ సెక్షన్ 188, 271, 273 ఐపీసీ సెక్షన్ 56,57,59 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టాడర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే తనపల్లి క్రాస్ వద్ద ఉన్న టాబన్ అరబిక్ రెస్టారెంట్ హోటల్‌పై కూడా దాడులు నిర్వహించారు. అలాగే ఎయిర్ బైపాస్ రోడ్డులోని పొరెట్స్ హోటలపై దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా నిల్వ ఉంచిన చికెన్, మటన్‌ను ధ్వంసం చేశారు. పలు ఆహార పదార్థాలకు సంబంధించిన శాంపుల్స్ సేకరించారు. నగరంలోని పలు హోటల్స్‌పై కూడా దాడులు చేసి సాంపుల్స్ సేకరించారు. నివేదికలు వచ్చిన వెంటనే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణాచారి, శేషాద్రి తెలిపారు