క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 12: జలవనరుల శాఖలో అవినీతి ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ధ్రువీకరణపత్రం ఇచ్చేందుకు రూ.56వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ నెల్లూరు సర్కిల్ జలవనరుల శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రావు సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆత్మకూరు మండలం యడ్లపాడు గ్రామ తాజా మాజీ సర్పంచ్ గుర్రం పెంచలయ్య తమ గ్రామ పరిధిలో నీరు-చెట్టు పథకం కింద ఏడు చెక్‌డ్యాంలను నిర్మించారు. వీటికి సంబంధించి ఆయనకు జలవనరుల శాఖ నుండి రూ.55.09లక్షల మేర నగదు రావాల్సి ఉంది. అయితే నగదు బిల్లులు పొందాలంటే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల వద్ద నుండి ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుంది. ఈ పత్రం కోసం నెల్లూరులోని క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ వెంకట్రావును పెంచలయ్య సంప్రదించాడు. మూడు నెలల నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అదుగో ఇదుగో అంటూ జాప్యం చేస్తున్నాడు. చివరికి నిలదీయగా మొత్తంలో ఒక శాతం అంటే రూ.56వేలు లంచంగా ఇస్తేనే సర్ట్ఫికేట్ ఇస్తానని ఎఇ పెంచలయ్యకు స్పష్టం చేశారు. గత నెల 27న వెంకట్రావు వద్దకు వచ్చిన పెంచలయ్య మొత్తం ఏడు పనుల్లో నాలుగు పనులకు సంబంధించి సర్ట్ఫికెట్లు తీసుకొని మిగతా మూడు సర్ట్ఫికెట్లు తీసుకునే సమయంలో ఎఇ అడిగిన మొత్తాన్ని ఇస్తానని చెప్పాడు. అయిన్పటికీ ఎసి పెంచలయ్యను డబ్బుకోసం వేధించడంతో పెంచలయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఏసీబీ డిఎస్పీ శాంతో సూచనల మేరకు.. పథకం ప్రకారం పెంచలయ్య ఎఇకి డబ్బు ఇస్తుండగా ఎసిబి అధికారులు వెంకట్రావును అదుపులోకి తీసుకొని లంచం కింద తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకట్రావును ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శాంతో తెలిపారు.