క్రైమ్/లీగల్

ముగ్గురు ఘరానా దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, నవంబర్ 12: ఆటోలో తిరుగుతాడు.. తాళం వేసిన ఇళ్లను చూస్తాడు.. మోటరు సైకిల్‌పై వచ్చి తాళం పగల గొట్టి ఇంటిని స్మాట్‌గా దొచుకుపోతాడు. జంట కమిషనరేట్ పరిధిలో 14 దొంగతనాలు చేసి పోలీసులకు దొరికిన ఘరాన దొంగ నుంచి రూ. 22లక్షల విలువ చేసే 73తులాల బంగారం ఆభరణాలను ఎల్‌బీనగర్ సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో బంగారం చైన్లు లాక్కుపోయే మరో ఇద్దరు నిందితులను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగత్ వివరాలను వెల్లడించారు. జవహర్‌నగర్‌లోని అంబేద్కర్ కాలనీలో నివాసముండే సంపంగి మహేష్ ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన మహేష్ డబ్బు కోసం దొంగతనాలు చేసేవాడు. పగలు ఆటోలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను పరిశీలించేవాడు. రాత్రి మోటరు సైకిల్‌పై వచ్చి ఇంట్లోని బంగారం ఆభరణాలను దొచుకుని పోతాడు.
ప్రధాన ద్వారం తాళం రాకపోతే ఇంటి వెనుక ఉన్న వంట గది తులపులు పగల గొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను సులువుగా తీసి సోత్తు దొచుకు పోతాడు. రాచకొండ పరిధిలో 11 సైబరాబాద్‌లో మూడ దొంగతనాలు చేసినట్లు కమిషనర్ తెలిపారు. నిందితుడి నుంచి 22లక్షల 63వేల రూపాయల విలువ చేసే 73 తులాల బంగారం ఆభరణలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. నిందితుడితో పాటు దొంగ సోత్తును కోనుగోలు చేసిన రిసీవర్ శంకర్‌చారిని కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో కేసులో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మల్కజ్‌గిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్టలో నివాసముండే మహమ్మద్ అమీర్ అలీయాస్ ప్రిన్స్ (26) సయ్యద్ తౌఫిక్ (30) ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు.
నిందితుల నుంచి రూ. 3లక్షల విలువ చేసే 2.9 తులాల బంగారం గొలుసు ఐదు మోటరు సైకిళ్లను స్వాధీనం చేసకున్నట్లు సీపీ వివరించారు. ప్రధాన నిందితుడు అమీర్‌పై 2014లో చిక్కడపల్లి పీడీ యాక్టు కేసులో జైలులో ఉన్న సమయంలో తౌఫిక్‌తో జత కట్టాడని చెప్పారు. జైలు నుంచి సెప్టెంబర్ 11న వచ్చి నెల రోజుల్లో నాలుగు చైన్ స్నాచింగ్‌లు ఐదు మోటరు సైకిళ్లను ఇద్దరు దొంగిలిచారని పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్‌లకు అనువైన 29ప్రాంతాలను పరిశీలించిన్నట్లు మహేష్ భగత్ తెలిపారు.
నిందితులను అరెస్టు చేసిన మల్కజ్‌గిరి, ఎల్‌బీనగర్ సీపీఎస్ పోలీసును అభినందించి క్యాష్ రివార్డు అందించారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, సలీమా పాల్గొన్నారు.