క్రైమ్/లీగల్

నగల దుకాణంలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియస్‌పురం, నవంబర్ 12: ప్రకాశం జిల్లా సిఎస్‌పురం మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ గోల్డ్‌వర్క్స్ దుకాణంలో శనివారం రాత్రి దొంగలు ఇంటిముందు భాగాన తాళాలు పగులగొట్టి దుకాణంలోకి ప్రవేశించి ఇంటి వెనుక ఉన్న బీరువా పగులగొట్టి 135 సవర్ల బంగారం దొంగిలించిన సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
దుకాణం యజమాని పత్తిపాటి శ్రీహరి ఈనెల 6న కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పొరుగువారి సమాచారం మేరకు దొంగతనం విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
శ్రీహరి సోమవారం సియస్‌పురానికి చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలాన్ని కందుకూరు డిఎస్పీ కె ప్రకాష్‌రావు, పామూరు సిఐ మధుబాబు, పామూరు, లింగసముద్రం, సియస్‌పురం ఎస్‌ఐలు రాజేష్‌కుమార్, వెంకటేశ్వరరావు, విజయ్‌కుమార్‌లతోపాటు ఒంగోలు డ్వాగ్‌స్వ్కాడ్‌ను, క్లూస్‌టీం సంఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు, త్వరలో నిందితులను పట్టుకుంటామని, చోరీ జరిగిన బంగారం విలువ రూ.25లక్షలు ఉంటుందని డిఎస్పీ ప్రకాష్‌రావు తెలిపారు.