క్రైమ్/లీగల్

మందుపాతర పేలి కానిస్టేబుల్‌కు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, నవంబర్ 13: మండలంలోని బోదనెల్లి- చింతగుప్ప అటవీ ప్రాంతంలో మంగళవారం కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ మందుపాతర పేలడంతో ప్రత్యేక పోలీసుపార్టీకి చెందిన కె.నాగరాజు అనే కానిస్టేబుల్ చేతికి గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన నాగరాజును భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్.కొత్తగూడెం నుంచి కుర్నపల్లి వరకు పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్న క్రమంలో ఈ మందుపాతర పేలినట్లు తెలిసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. మందుపాతర పేలిన శబ్ధం చుట్టుపక్కల గ్రామాలకు వినిపించడంతో ప్రజలు భయాందోళన చెందారు.