క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, నవంబర్ 13 : ఒక కేసులో సబ్‌జైల్‌కు వెళ్లాననే మనస్థాపంతో గుర్రం వెంకటేశులు (31) మంగళవారం స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామారావు తెలిపారు. మండల కేంద్రంలోని 6వ వార్డుకు చెందిన వెంకటేశులు ఒక కేసులో అరెస్టై సబ్‌జైల్‌కు వెళ్లాడు. ఈనేపథ్యంలో మనస్థాపానికి గురైన వెంకటేశులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించామన్నారు. మృతుడి తండ్రి కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి
సోమందేపల్లి, నవంబర్ 13: మండల కేంద్రంలోని సాయిబాబా గుడి వద్ద హిందూపురం రోడ్డుపై సోమవారం క్రేన్ ఢీకొని తీవ్ర గాయాలపాలైన తిమ్మయ్యను బెంగళూరులో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెంచినట్లు ఎఎస్సై తిరుపాల్ నాయక్ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం
బత్తలపల్లి, నవంబర్ 13: బత్తలపల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి సోమవారం రాత్రి తమ ఇంటిలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన సమాచారం మేరకు జలాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు ఉమేష్‌చంద్ర బత్తలపల్లిలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దీపావళి రోజున రెండు రోజులపాటు పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయుడు కొట్టడం వల్ల క్రిమిసంహారక మందు తాగినట్లు బాధితుని తల్లి శిరీష చెబుతోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు బత్తలపల్లికి చేరుకొని పాఠశాల యాజమాన్యంతో చర్చించారు. డీవైఈవో దేవరాజు, తహసీల్దార్ శివయ్య, ఎంఈవో చాముండేశ్వరి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు స్థానిక పాఠశాలకు చేరుకొని యాజమాన్యంతోనూ, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం స్థానిక ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉమేష్‌చంద్రను పరిశీలించారు. అనంతరం వైద్యులతో చర్చించి తల్లిదండ్రులతో వివరాలు సేకరించారు. బాధితుడు ఉమేష్‌చంద్ర కోలుకున్న అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాలు బయటకు వస్తాయని అధికారులు పేర్కొన్నారు.