క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, నవంబర్ 13 : కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో మంగళవారం సాయంత్రం విద్యుదాఘాతంతో పట్టణానికి చెందిన పశువుల రమేష్ (33) మృతిచెందాడు. రమేష్ బైపాస్ సమీపంలో పశువులను మేపుకొచ్చేందుకు తీసుకొచ్చాడు. అయితే ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు దాడుతుండగా 8 అడుగుల ఎత్తులో ఉన్న 33 కేవీ విద్యుత్ వైర్లు తలకు తగిలాయి. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. కాగా సోమవారం రాత్రి నాగలగట్ట వద్ద ట్రిపర్ విద్యుత్ లైన్‌ను ఢీకొట్టడంతో రెండు స్తంబాలు విరిగిపోయి నెలకు వాలాయి. దీనివల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకూ పోలీసులు వచ్చి వారిని సముదాయించి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జామీల్‌బాషా తెలిపారు.