క్రైమ్/లీగల్

లారీని ఢీకొన్న వాహనం: బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, నవంబర్ 13: ముందు వెళ్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి అవుషాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అవుషాపూర్ గ్రామ సమీపంలో- ముందు లారీ వెళ్తుండగా వెనుక నుంచి యాదాద్రి జిల్లా వడపర్తి గ్రామానికి చెందిన మల్లేష్, కవిత కుమారుడు బబ్లు(7) వెళ్తున్నట్లు తెలిపారు. లారీ ఒక్కసారి బ్రేక్ వేసి ఆగడంతో వెనుక ఉన్న ద్విచక్ర వాహనం వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం ట్యాంక్‌పై కూర్చున్న బాలుడు బబ్లుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు.