క్రైమ్/లీగల్

పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, నవంబర్ 14: పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆద్వర్యంలో దాడులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ విలేఖలతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదు రావడంతో తాము కార్యాలయంపై దాడుల చేశామన్నారు. సబ్ రిజిస్ట్రార్ బాలాజీ కార్యాలయానికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేశామన్నారు. ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్నారని, అలాగే స్టాంప్ రైటర్లు ఉన్నారని, వీరందరి వద్దా ఎటువంటి చలానాలు లేకుండా రూ.1,24,230 నగదు ఉందన్నారు. ఈ నగదుకు సంబంధించి ఎటువంటి రసీదులుగానీ, ఆధారాలుగానీ లేకపోవడంతో ఆ డబ్బును తాము స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నామన్నారు. అలాగే కార్యాలయ అధికారులు, ప్రైవేటు సిబ్బందిని, స్టాంప్ రైటర్లను విచారణ చేయాల్సివుందన్నారు. వారి వద్దనున్న 14 సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు మీ దృష్టికివస్తే తమకు సమాచారమందించాలని ఆయన ప్రజలను కోరారు.