క్రైమ్/లీగల్

పెద్దిపాలేంలో విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందపురం, నవంబర్ 14: మండలంలోని పెద్దిపాలేం గ్రామంలో గల ఒక రైసుమిల్లుపై బుధవారం విజలెన్స్ అధికారులు దాడిచేసి రూ.26లక్షల విలువైన 85టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలిలావున్నాయి. పెద్దిపాలేంకు చెందిన చెన్నా శ్రావణి గత కొనే్నళ్లుగా శ్రీ సాయి బాలాజీ మోడ్రన్ రైస్‌మిల్లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియాన్ని కార్డు దారుల నుండి కొనుగోలు చేసి రీసైక్లింగ్ ద్వారా సన్న బియ్యంగా మార్పుచేస్తున్నారనేది అభియోగం. పక్కా సమాచారంపై విజిలెన్స్ అధికారులు దాడి చేయగా ఐదు ఆటోల్లో వచ్చిన నాలుగు టన్నుల బియ్యం, మిల్లు లోపలి వన్న 81టన్నుల బియ్యంనకు ఎటువంటి బిల్లులు లేకపోవడంతో అక్రమ నిల్వలుగా గుర్తించారు. ఇవన్నీ పిడిఎస్ బియ్యంగా నిర్థారించి ఆటోలను సీజ్‌చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఈ మిల్లుపై మూడుసార్లు దాడులు చేసి బియ్యం నిల్వలు స్వాధీనం చేసకున్నామన్నారు. పదే పదే అక్రమ వ్యాపారం చేస్తున్న మిల్లు యజమాని లైసెన్స్ రద్దుచేయడం, క్రిమినల్ కేసుపెట్టడానికి అధికారులకు సిఫార్స్‌చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిఎస్‌పి ఎన్.శ్రీనివాసరావు, డిటి జయ, డిసిటిఓ రేవతి, తహశీల్దార్ సుమబాల, ఆర్‌ఐ వరలక్ష్మి, విఆరోఓ పోతిన వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు.