క్రైమ్/లీగల్

కటకటాలకు కసాయి తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, నవంబర్ 14: జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యను వదిలించుకోవాలన్న ప్రయత్నంలో కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి కటకటాలపాలయ్యాడు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన సిలివేరు శివకుమార్ (27)ను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రామన్నపేట కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు నల్లగొండ జైలుకు తరలించారు. ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ బాపురెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన ఏరుకొండ అంజయ్య, పాపమ్మల కుమార్తె అక్షర అలియాస్ స్వప్నకు 16 నెలల క్రితం ఎల్లంబావికి చెందిన సిలివేరు శివకుమార్‌తో కట్నకానుకలిచ్చి వివాహం చేసారు. గ్రామంలో కిరాణం దుకాణం నిర్వహిస్తూ కొంత కాలం కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అక్షరను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసాడు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసాడు. అనుమానం పెంచుకున్నాడు. పిల్లలు వద్దని వాధించాడు. విడాకులు ఇవ్వమని వత్తిడి తెచ్చాడు. అన్నింటికి ఓర్చుకోని కాపురం కొనసాగించింది. ఇదే క్రమంలో అక్షర పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అమెను అడ్డు తొలిగించుకుందామంటే బిడ్డ అడ్డుగా మారిందని మదనపడ్డాడు. తల్లిగారింటి వద్ద ఉన్న అక్షర రెండు నెలల 15 రోజుల బిడ్డతో పక్షం రోజుల క్రితం అత్తింటికి వచ్చింది. అక్షరతో తెగదెంపులు చేసుకోవాలంటే బిడ్డ ముందుగా అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం పసిపాప నిహారికను మంచంపై పడుకోబెట్టి తల్లి అక్షర బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన కసాయి తండ్రి శివకుమార్ పసికూన గొంతు నులిమాడు. మంచానికి వేసి తలను బాదాడు. పాప కేకలు విన్న అక్షర పరుగున వచ్చింది. అక్షర రాకను చూసి తండ్రి పరారయ్యాడు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. మంగళవారం సాయంత్రం శివకుమార్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. బుధవారం రామన్నపేట కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు నల్లగొండ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతుందని బాపురెడ్డి తెలిపారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సాయిలు ఉన్నారు.