క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, అక్టోబర్ 15: ప్రమాదవ శాత్తు బోనకల్ బ్రాంచ్ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన మండల పరిధిలోని తనికెళ్ళ సమీపంలో బిబిసి వంతెన సమీపంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, యువకుని కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన యాసా వేణు గోపాల్ (26) ఇంట్లో అయ్యప్ప భక్తులు భిక్ష చేసిన వస్తువులను ఉదయం నీటిలో వేసేందుకు గ్రామ మమీంలో గల బిబిసి వద్దకు వెళ్ళి వస్తువులను నీటిలో వేసేక్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో సాయంత్రం వరకు కాలువ వెంట గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య శ్రీలత ఉంది. మృతదేహం బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.