క్రైమ్/లీగల్

అత్యాచార యత్నం కేసులో కార్పొరేటర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, నవంబర్ 15: ఓ ఉపాధ్యాయురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నెల్లూరు కార్పొరేషన్ 53వ వార్డు కార్పొరేటర్ దేవరకొండ అశోక్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, లక్షా 10వేల రూపాయల జరిమానా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి సత్యనారాయణ బుధవారం తీర్పు చెప్పారు. ఆ జరిమానా పైకంలో నుండి లక్ష రూపాయలు బాధితురాలికి చెల్లించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కేసులోని కొన్ని సంఘటనలకు సహకరించాడనే అభియోగంపై మరో నిందితుడు కట్టా అశోక్‌కు 10వేల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఫిర్యాది జిల్లాలోని జడ్పీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఈమె భర్త కూడా అదే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ ఓ క్రిమినల్ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. కాగా, తన భర్త క్రిమినల్ కేసు విషయంలో సహాయం చేయాలని బాధిత టీచర్ నిందితుడైన కార్పొరేటర్ అశోక్‌ను కలిసింది. ఇందుకుగాను 50వేల రూపాయల పైకం ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించిన్న టీచర్ 50వేల రూపాయలు తీసుకొని నిందితుడి కోరిక మేరకు 2014 ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు నెల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలోని హోటల్‌కు వెళ్లారు. అక్కడే ఆమెను కలిసిన నిందితుడు అశోక్ వ్యక్తిగతంగా మాట్లాడాలని అదే హోటల్‌లోని రూమ్‌కు ఆమెను తీసుకెళ్లాడు. ఆ హోటల్ రూమ్‌లో అప్పటికే మంచంపై రెండో నిందితుడు కట్టా అశోక్ విశ్రమించి ఉండడంతో బాధిత మహిళను నిందితుడైన కార్పొరేటర్ రూమ్‌లో ఉన్న బాత్రూమ్‌లోకి బలవంతంగా తోసి అక్కడ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణ. ఈమేరకు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపిసి 376, 354 తదితర సెక్షన్ల ప్రకారం కోర్టులో నిందితులపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం నిందితుడు కార్పొరేటర్ దేవరకొండ అశోక్ బాధిత మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు నేరం సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో పైమేర శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ వాదించారు.