క్రైమ్/లీగల్

20 మోటారు బైకులు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 16: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్‌లోవున్న ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ వెనుక షెడ్‌లో పార్కింగ్ చేసి ఉన్న 20 మోటార్ సైకిళ్ళు, ఒక సైకిలు ఆగ్నిప్రమాదంలో శుక్రవారం తెల్లవారుజామున కాలి బూడిదయ్యాయి. సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న షెడ్డులో పలు ప్రాంతాలకు డ్యూటీపై వెళ్ళే పోలీసు కానిస్టేబుళ్లు వారి మోటార్ సైకిళ్ళను స్టేషన్ వెనుక భాగంలో విశాలంగా వున్న షెడ్డులో నిత్యం పార్కింగ్ చేస్తుంటారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 4.20 నిమిషాల ప్రాంతంలో షెడ్డులో మోటార్ సైకిళ్ళు అగ్నిప్రమాదంలో కాలిపోతున్న సంఘటనను విశాఖపట్నం వైపు వెడుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు గార్డు జీఎల్‌వీ సాగర్ చూసి స్థానిక రైల్వే కానిస్టేబుల్ శేఖర్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో పెద్దాపురం అగ్నిమాపక అధికారి ఏసుబాబు ఆధ్వర్యంలో బృందం మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో 24 మోటార్ సైకిళ్లకు 20 మోటార్ సైకిళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో నాలుగు మోటార్ సైకిళ్ళు పాక్షికంగా దగ్ధం కాగా వాటిని పక్కకు తప్పించారు. మోటార్ సైకిళ్ళు పార్కింగ్ చేసిన షెడ్డులో ఉన్న విద్యుత్ ఎర్త్‌వైర్ నుండి ఏర్పడిన షార్ట్‌సర్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. రెండు పల్సర్ మోటార్ సైకిళ్ళ పెట్రోల్ ట్యాంక్‌లు బారీ శబ్దాలు చేస్తూ పేలడంతో మంటలు అన్ని మోటార్ సైకిళ్ళకు వ్యాపించాయి. సుమారు రూ.6లక్షలు పైబడి ఆస్తి నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రైల్వే సీఐ కె మధుసూదనరెడ్డి, ఆర్పీఎఫ్ పోలీసులు సందర్శించారు. ఈ మేరకు సామర్లకోట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.