క్రైమ్/లీగల్

విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ఉపాధ్యాయుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, నవంబర్ 16: మండలంలోని వైచెర్లోపల్లి మోట్ల మల్లికార్జునపురంలో ఎపి మోడల్ స్కూల్‌లో విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈవిషయంపై మార్కాపురం డివైఎస్పీ రామాంజనేయులు మోడల్ స్కూల్‌కు శుక్రవారం వెళ్ళి ప్రిన్సిపాల్ నయోమిని, విద్యార్థినులను, ఉపాధ్యాయుడిని విచారించారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈనెల 12వ తేదీన పాఠశాలకు రాలేదు. 13వ తేదీన ఆ విద్యార్థిని పాఠశాలకు రావడంతో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినికి పనిస్మెంటు విధిస్తూ ల్యాబ్‌ను శుభ్రం చేయాలని తెలిపాడు. దీంతో ఆ విద్యార్థిని ల్యాబ్‌ను శుభ్రం చేస్తుండగా ఉపాధ్యాయుడు విద్యార్థినిని బలవంతం చేయబోగా తప్పించుకొని వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్ నయోమికి తెలిపింది. ఈమేరకు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మార్కాపురం డివైఎస్పీ రామాంజనేయులు పాఠశాలను సందర్శించి సదరు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.