క్రైమ్/లీగల్

నల్లగొండ శివారుల్లో తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 16: నల్లగొండ పట్టణ శివారులోని మునుగోడు రోడ్డు బీఈడి కళశాల వద్ద ఎన్నికల అధికారులు (ఫ్లైయింగ్ స్క్వాడ్) వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా మునుగోడుకు చెందిన రుద్రాక్షి సైదులు బైక్ పై బ్యాంక్ నుండి 9లక్షల 90వేల రూపాయలు సంచిలో తీసుకొని అనుమానాస్పదంగా వెళ్తుండడంతో ఎన్నికల అధికారి శ్రీపాద సుధాకర్ బండిని ఆపి పెద్దమొత్తంలో సొమ్ము అజాగ్రత్తగా తీసుకెళ్తుండడంతో పాటు ఏ అవసరానికి తీసుకెళ్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో సొమ్మును సీజ్ చేసి డీటీఓ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సొమ్ముకు సంబంధించి తగిన ఆధారాలు తీసుకువస్తే తిరిగి అందజేస్తామన్నారు. కాగా, ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఒక కోటి నలభై మూడు లక్షల సొమ్ము సీజ్ చేసినట్లు ఎంసీసీ అధికారులు వెల్లడించారు.
బెల్ట్‌షాపులపై ఎక్సైజ్ పోలీసుల దాడి
బీబీనగర్, నవంబర్ 16: మండలంలోని జియాపల్లి, జమీలాపేట, నెమురగొమ్ల గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టుషాపులపై దాడులు చేశారు. ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీరేశం, బాల్‌రాజ్, మాధవరెడ్డి, ఆంజనేయులుపై కేసులు నమోదు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. అరెస్టు చేసిన నలుగురి వద్ద నుండి 92 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపులపై దాడులలో ఎస్సై కోటమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.