క్రైమ్/లీగల్

మాంసం మార్కెట్ తరలిస్తున్న 47 సబ్సిడీ గొర్రెల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెలు పక్కదారి పట్టి మాంసం మార్కెట్‌కు తరలిస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా సీసీఎస్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామం మీదుగా ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 47 సబ్సిడీ గొర్రెలను పట్టుకుని, వాటిని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి, తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గోపులాపురం గ్రామానికి చెందిన పర్శ కొమురయ్య(50) నుండి గంగాధర మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన పుల్ల వీరయ్య(52) అనే వ్యక్తి సబ్సిడీ గొర్రెలను అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తుండగా బద్దెనపల్లి బస్ స్టాప్ వద్ద వీటిని పట్టుకున్నారు. ఈ గొర్రెలు ఎపి15- టీఏ 9574 అనే ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా ఇందులో తీసుకెళుతున్న 39 పెద్ద గొర్రెలు, 8 వాటి పిల్లలు మొత్తం 47 గొర్రెలను, వాటిని తరలిస్తున్న నిందితులను పట్టున్నారు. అనంతరం తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సీసీఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.