క్రైమ్/లీగల్

ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, నవంబర్ 17: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాల్లో శనివారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 200 సర్వీసులు అక్రమమైనవిగా గుర్తించి రూ. 8.10 లక్షల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఏడీఈ కార్యాలయంలో తిరుపతి ట్రాన్స్‌కో విజిలెన్స్ ఎస్‌ఈ భార్గవరాముడు, సీఐ శ్రీ్ధర్ మాట్లాడుతూ కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ట్రాన్స్‌కో అధికారులు దాడులు నిర్వహించారన్నారు. 200 మందిలో 120 మందికి సర్వీసులు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చైతన్యం రావాలని వారికి రూ.120కే ఉచిత మీటర్ ఇస్తున్నామన్నారు. నెలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 2900 అక్రమ కనెక్షన్లు గుర్తించి రూ. 1.10 కోట్ల జరిమానా విధించామన్నారు. ఇందులో రూ.90 లక్షలు వసూలు చేశామన్నారు. ప్రజలు విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లించాలని, అక్రమంగా విద్యుత్ వాడుకోవద్దని సూచించారు.