క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 17: ఇటీవల కాలంలో జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలను అరికట్టే క్రమంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు కర్నాటక తదితర రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లు, కారు అద్దాలు పగులగొట్టి సొత్తు చోరీ తదితర నేరాలకు పాల్పడే అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప గ్రామానికి చెందిన తుపాకుల అనూక్‌కుమార్, బాణాల చిన్న, తుపాకుల సునీల్, మేకల రాజు, మేకల ప్రేమ్‌కుమార్ ముఠాగా ఏర్పడి తరచూ పైన పేర్కొన్న తరహా నేరాలకు పాల్పడుతుంటారు. చిన్నతనం నుండి దొంగతనాలకు అలవాటు పడిన వారు గతంలో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పలు నేరాలకు పాల్పడి ఆయా రాష్ట్రాల్లో జైలుశిక్ష అనుభవించి ఉన్నారు. వివిధ రాష్ట్రాలు తిరుగుతూ పట్టణాల్లో కుటుంబాలతో కలిసి ఇళ్లు అద్దెకు తీసుకొని నివసిస్తూ నేరాలకు పాల్పడుతుంటారు. తర్వాత మకాం మరోచోటికి మారుస్తుంటారు. ఇదే తరహాలో నెల్లూరు నగరంలోనూ 26 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. జామీనుపై విడుదలైన వారు తిరిగి అదే తరహాలో గత మూడు నెలలుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మహిళల మెడలో చైన్ స్నాచింగ్, మోటార్‌సైకిల్‌పై వచ్చి బ్యాగ్ లాక్కొని వెళ్లడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. తరచూ జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేయించారు. క్రైం ఓఎస్‌డి ఆంజనేయులు పర్యవేక్షణలో క్రైం బ్రాంచ్ డిఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో సిఐ బాజీజాన్ సైదా, బాలాజీనగర్ సిఐ వేణుగోపాల్‌రెడ్డి, సిసిఎస్ ఎస్సైలు షేక్ షరీఫ్, కె.మురళీప్రసాద్ వారి సిబ్బంది స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద రెండు మోటార్‌సైకిళ్లపై వస్తున్న నిందితులు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 26 చోట్ల, చిత్తూరు జిల్లాలో నాలుగుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరి వద్ద నుండి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 90 సవర్ల బంగారు నగలను, రెండు మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో వీరి బంధువులు కూడా ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందచేశారు. ఈ సమావేశంలో ఎఎస్పీ పరమేశ్వరరెడ్డి, ఓఎస్‌డి క్రైం ఆంజనేయులు, సిసిఎస్ డిఎస్పీ బాలసుందరరావు తదితరులు పాల్గొన్నారు.