క్రైమ్/లీగల్

హుండీ దొంగలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, నవంబర్ 17 : దొనకొండ మండలం మంగినపూడి గ్రామంలో మార్చి నెల 26వ తేదిన జరిగిన హుండీ దొంగతనం కేసులోని దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్లు దర్శి డియస్‌పి నాగేశ్వరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక డియస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డియస్‌పి మాట్లాడుతూ దొనకొండ మండలం మంగినపూడి శివాలయం లో హుండీ పగులకొట్టి అందులో పది వేలు దొంగలించినట్లు శివాలయం పూజారి పి సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సి ఐ ఆధ్వర్యంలో బృందాలతో గత మూడు నెలలుగా గాలించి శనివారం పామూరు మండలానికి చెందిన ఇండ్లా నాగార్జున, ఇండ్లా ఈశ్వరయ్య, కొమ్ము శ్రీను లను దొనకొండ నాలుగు రోడ్ల కూడలి వద్ద రెండు మోటార్ సైకిళ్ళ పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా శివాలయంలోని హుండీ దొంగతనం తో పాటు మర్రిపూడి, చంధ్రశేఖరపురం, పామూరు, కనిగిరి, లింగ సముద్రం , నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలతో పాటు మరికొన్ని చోట్ల గుళ్ళల్లోని హుండీలు దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు డియస్‌పి తెలిపారు. వీరి వద్ద నుండి 43వేల 500 నగదుతో పాటు శతగోపురం, దీపపు కుందెలు, హారతి పళ్ళెం ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చినట్లు డియస్‌పి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఎం శ్రీనివాసరావు, మర్రిపూడి ఎస్ ఐ శ్రీహరి తదితరులు ఉన్నారు.