క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలోవృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 18: మండలంలోని చిలకపాలెం కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జరజాపు అప్పయ్య (60) అనే వృద్ధుడు మృతి చెందినట్లు స్థానిక ఎస్సై ఎస్.కృష్ణ తెలిపారు. మృతుడు అప్పయ్య ఎన్నో ఏళ్లుగా చిలకపాలెం కూడలిలో కళాసీగా ప్రయాణీకులుకు సేవలందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన అప్పయ్యను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విశాఖపట్నంలోని కళ్యాణి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిలకపాలెం గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.