క్రైమ్/లీగల్

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఏఎన్‌ఎం చిన్నమ్మ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, మార్చి 6: మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామ పంచాయతీ సమీపంలోగల ఆర్‌అండ్‌బీ రహదారిపై మంగళవారం ఉదయం పది గంటల సమయంలో జరిగిన రోడ్డుప్రమాదంలో తూర్పుతాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందింది. దీనికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్‌గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం గునుపూడి చిన్నమ్మ (48) మంగళవారం ఉదయం ఆశా వర్కర్ల సమావేశానికి స్కూటర్ మీద బయలుదేరి తూర్పుతాళ్లప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళుతుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏఎన్‌ఎం చిన్నమ్మ కిందకు జారి వెనుక చక్రంలో పడి అక్కడికక్కడే మృతిచెందిందన్నారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న నరసాపురం డీఎంఅండ్‌హెచ్‌వో పద్మజ, తూర్పుతాళ్ల ఆసుప్రతి డాక్టర్లు బాలసుధ, మహేష్, రాంబాబు, సిబ్బంది చింతపల్లి రవికుమార్, సాంబశివరావు, మోహన్‌రావులు చిన్మమ్మ మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చిన్నమ్మది ఉండి మండలమని, ఆమె భర్త ప్రభుదాస్ వ్యవసాయం చేస్తుంటారని, చిన్నమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని సమీప ఏఎన్‌ఎం వర్గాల సమాచారం. కాగా చిన్నమ్మ మృతికి కారకులను వెంటనే అరెస్టు చేయాలని, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పేరుపాలెం రహదారిపై తూర్పుతాళ్ల, ఎల్‌బి చర్ల, మొగల్తూరు పీహెచ్‌సీ పరిధిలోని ఏఎన్‌ఎంలు పెద్దఎత్తున తరలివచ్చి రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. రహదారిపై ధర్నా నిర్వహించటంతో సంఘటనాస్థలానికి నరసాపురం సీఐ ఎం సుబ్బారావు తన సిబ్బందితో హుటాహుటిన చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. జరిగిన సంఘటనపై తక్షణం దర్యాప్తు ఆరంభించి బాధ్యులను అరెస్టుచేసి తీరుతామని సీఐ సుబ్బారావు నచ్చచెప్పటంతో ఏఎన్‌ఎంలు ఆందోళనను విరమించారు. అనంతరం చిన్నమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు.