క్రైమ్/లీగల్

రూ.15 లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర నవంబర్ 18: మధిర మండల పరిధిలో ఆత్కూరు చెక్‌పోస్టు వద్ద అర్టీసీ బస్సులో తరలిస్తున్న 15 లక్షల నగదును స్టాటిక్ సర్వేలైన్ టీం ఇన్‌చార్జ్ అధికారి రాజేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఖమ్మం నుండి ఆదివారం ఉదయం మధిరకు వస్తున్న పల్లెవెలుగు బస్సు నెంబర్ ఎపి 29జడ్ 1039ని ఆత్కూరు చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఎస్‌టి టీం తనిఖీలో రూ.15లక్షల నగదు పట్టుబడింది బస్సులో ప్రయాణీకులు ఎక్కువగా వున్నారు. బస్సు వెనుక భాగంలో వున్న బ్యాగును తనిఖీ చేయగ అందులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు, 500 రూపాయల నోట్ల కట్టలు కలిపి 15 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఈ డబ్బు తమది అని ఎవరు ముందుకు రాకపోవడం గమనార్హం. డబ్బు పట్టుకున్న ఎస్‌ఎస్‌టి టీం అధికారులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఆర్‌ఐ జాస్మీన్ చెక్‌పోస్టు వద్దకు వెళ్ళి పంచనామా నిర్వహించి నగదును మధిర టౌన్ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఎన్నికల తరుణంలో ఆర్‌టిసి బస్సులో పెద్ద ఎత్తున నగదు తరలిస్తు పట్టుబడటం ఆ డబ్బు తమదంటు ఎవరు ముందుకు రాకపోవడంతో మధిర ప్రాంతంలో కలకలం రేపింది. ఎన్నికలలో డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకె ఈ నగదు తరలిస్తున్నారని ఆ డబ్బు తమదని ఎవరైన ముందుకు వస్తే వారు ఏ పార్టీకి చెందిన వారో తెలుస్తుంది కనుక డబ్బు పట్టుబడిన ఎవరు ముందుకు రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు రెండు బస్సులు వెళ్ళిన మామూలుగా తనిఖీలు నిర్వహించిన ఎస్‌ఎస్‌టి టీం అధికారులు ప్రయాణీకులు ఎక్కువగా వున్నప్పటికి ఈ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి నగదు పట్టుకున్నారంటే ఈ బస్సులో నగదు తరలిస్తున్నారని వారికి సమాచారం వుండటం వల్లనే నగదు పట్టుబడిందని రాజకీయ నాయకులు పేర్కొటున్నారు. ఏది ఏమైన ఎన్నికల సమయంలో తొలిసారిగా మధిర ప్రాంతంలో డబ్బు పట్టుబడటం ఆ డబ్బు తమదని ఎవరు ముందుకు రాకపోవడం సంచలనంగా మారింది.